schedule Saturday, July 11, 2026

పూస‌ల సంఘం జిల్లా కార్య‌వ‌ర్గం ఎన్నిక‌

calendar_today January 31, 2022
person dharshininews
పూస‌ల సంఘం జిల్లా కార్య‌వ‌ర్గం ఎన్నిక‌
పూస‌ల సంఘం జిల్లా కార్య‌వ‌ర్గం ఎన్నిక‌ - జిల్లా అధ్య‌క్షులుగా కృష్ణ‌స్వామి నియామ‌కం తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పూస‌ల‌(ముత్యాల‌) సంఘం వికారాబాద్ జిల్లా కార్య‌వ‌ర్గంను సంఘం స‌భ్యులు ఎన్నుకున్నారు. సోమ‌వారం తాండూరులో జిల్లా అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శుల‌ను ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్య‌క్షులు కె.కృష్ణ‌స్వామి, ఉపాధ్య‌క్షులుగా కె.శంక‌ర్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎస్.బ‌ల‌రాం, కోశాధికారిగా పుల్ల‌య్య‌, స‌హాయ కార్య‌ద‌ర్శిగా పి.మ‌ధుల‌ను ఎన్నుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ ప్ర‌భుత్వం పూస‌ల సంఘాల అభివృద్ధికి చొర‌వ చూపాల‌న్నారు. అర్హులైన వారికి ఫించ‌న్ల‌తో పాటు ఇండ్లు, స్థ‌లాల‌ను మంజూరు చేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, ప‌రిగి, తాండూరు నియోజ‌క‌వ‌ర్గాల సంఘం పెద్ద‌లు, స‌భ్యులు పాల్గొన్నారు.