schedule Thursday, September 03, 2026

కేసీఆర్‌పై మండిపడిన కాంగ్రెస్ నాయకులు

calendar_today February 3, 2022
person dharshininews
కేసీఆర్‌పై మండిపడిన కాంగ్రెస్ నాయకులు
రాజ్యాంగంపై విమ‌ర్శ‌లు దుర‌దృష్ట‌క‌రం - కేసీఆర్‌పై మండిపడిన కాంగ్రెస్ నాయకులు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ విమర్శాత్మ‌క వాఖ్య‌లు చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని తాండూరు కాంగ్రెస్ నాయ‌కులు అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు మండిపాటు వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనంపై నిరస‌న చేప‌ట్టిన కాంగ్రెస్ పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రె స్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి పోలీ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న విషయం మరిచి కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలనడం దురదృష్టకరమన్నారు. వెంటనే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవాజ్ మోయిన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.