schedule Thursday, September 10, 2026

వీఆర్ఏల పే-స్కేల్ జీఓను వెంటనే విడుదల చేయాలి

calendar_today February 7, 2022
person dharshininews
వీఆర్ఏల పే-స్కేల్ జీఓను వెంటనే విడుదల చేయాలి
వీఆర్ఏల పే-స్కేల్ జీఓను వెంటనే విడుదల చేయాలి - వయస్సు పైబడిన వారి వారసులకు ఉద్యోగం ఇవ్వాలి - తాండూరు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించిన నాయకులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏల కోసం ప్రకటించిన పే-స్కేల్ జీఓను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) ఐక్య కార్యాచరణ కమిటి సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం తాండూరు తహ సీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చిన్న అప్పలనాయుడుకు కమిటీ సభ్యులతో పాటు సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం ఫే-స్కేల్ జీఓను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 55 సంవత్సరాలు వయస్సు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు పదో న్నతులు కల్పించాలని, వీఆర్ఏలు అందరికి వారి సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూంలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కరోనాతో మరణించిన ఏఆర్ఏలకు రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాస్, వీఆర్ఏల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు చంద్రప్ప, గౌరవ అధ్యక్షులు అంజిలప్ప, కోశాధికారి ఎం కె మున్యప్ప, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.