schedule Friday, September 04, 2026

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం

calendar_today August 22, 2021
person dharshininews
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం

దర్శిని ప్రతినిధి : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం డ్యామ్‌కు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 32,231 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్‌ ఫ్లో 42,210 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం ప్రస్తుతం 878.40 అడుగుల మేర నీరుంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 179.89 టీఎంసీలు నిల్వ ఉన్నది. ఎడమగట్టు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది.