schedule Wednesday, September 09, 2026

సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం

calendar_today February 13, 2022
person dharshininews
సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం
సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం - అనుమ‌తులు లేకుండా నిర్వ‌హిస్తే చ‌ర్య‌లు - వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లాలో స‌భ‌లు, స‌మావేశాలు, ర్యాలీల‌పై విధించిన నిషేధం కొన‌సాగుతుంద‌ని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. అనుమతిలేకుండా స‌భ‌లు, స‌మావేశాలు, ర్యాలీలు నిర్వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో హెచ్చ‌రించారు. జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంద‌ని, దీనిని దృష్టిలో ఉంచుకుని వాటిపై నిషేధం విధించిన‌ట్లు వివ‌రించారు. ర్యాలీలు, సభలు మరియు సమావేశాలకు తప్పనిసరిగా పోలీస్ అధికారుల దగ్గర అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా ఇట్టి కార్యక్రమాలను నిర్వహించే వారిపైన చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చ‌రించారు. అదేవిధంగా పోలీస్ అధికారుల దగ్గర అనుమతి తీసుకోకుండా నిర్వహించే కార్యక్రమాలలో శాంతిభద్రతలను విఘాతం కలిగినా వాటి పూర్తి భాద్యత ఆయా సభలు నిర్వహించిన సంబంధితులపై ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు వారిపై చట్టప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంద‌ని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్రజలందరూ జిల్లా పోలీస్ అధికారులకు స‌హ‌క‌రించాల‌ని సూచించారు.