schedule Saturday, July 11, 2026

ఘనంగా సేవాలాల్ జయంతి

calendar_today February 15, 2022
person dharshininews
ఘనంగా సేవాలాల్ జయంతి
ఘనంగా సేవాలాల్ జయంతి - గోర్ బంజారా ఆధ్వర్యంలో అన్నదానం - పురవీధుల్లో బైక్ ర్యాలీ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : గిరిజన ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి 283వ జయంతి వేడుకలు గోర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.గోర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాథోడ్ ప్రకాష్ ఆధ్వర్యంలో 500 మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. పురవీధుల్లో యువకులు, నాయకుల ర్యాలీ ఆకట్టుకుంది. ర్యాలీతో పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోం వద్ద ఉన్న సేవాలాల్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ అసోసియేషన్ అధ్యక్షులు రాథోడ్ ప్రకాష్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ అరుణ్ నాయక్‌లు సేవాలాల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ అందరికి ఆదర్శప్రాయుడన్నారు. అంద‌రు సేవాలాల్ మ‌హారాజ్ అడుగుజాడల్లో పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్, బషీరాబాద్ మండల అధ్యక్షులు హర్ష పవార్, యూత్ అధ్యక్షులు భానుపవార్, పెద్దేముల్ మండల మండల సభ్యులు లోక్యా నాయక్, సాగర్ పవార్, యాలాల మండల కార్యదర్శి సురేష్ నాయక్. లక్ష్మణ్ నాయక్, యువకులు తదితరులు పాల్గొన్నారు.