schedule Saturday, July 11, 2026

అంబేద్కర్ ఆశీస్సులు తీసుకున్న నవదంపతులు

calendar_today February 22, 2022
person dharshininews
అంబేద్కర్ ఆశీస్సులు తీసుకున్న నవదంపతులు
అంబేద్కర్ ఆశీస్సులు తీసుకున్న నవదంపతులు - కొత్త జంట‌ను అభినందించిన నాయ‌కులు తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : వేద మంత్రాల సాక్షిగా ఒక్క‌టైన ఓ కొత్త జంట భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ ఆశీస్సులను తీసుకున్నారు. ఆద‌ర్శ‌ప్రాయులైన అంబేద్క‌ర్‌పై గౌర‌వాన్ని చాటుకున్న ఆ నవ‌దంప‌తుల‌ను ప‌లువురు అభినందిస్తున్నారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో జ‌రిగింది. సోమ‌వారం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు శివానంద్, లావణ్యలు వివాహా బంధంతో ఒక్కటయ్యారు. పెండ్లి హాడావుడి పూర్తి అయిన తరువాత దంపతులు నేరుగా గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. పెండ్లి బందువులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తమ జంటను దీవించాలని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ వల్ల తమకు గౌరవ ప్రదమైన జీవితం గడుపుతున్నాయని, కావున మాకు అంబేద్కర్ దేవునితో సమానమని అన్నారు. సమాజానికి మంచి సందేశంలా నిలిచిన ఈ సంఘటన్నపై గ్రామ మాజీ ఉపసర్పంచ్ హసన్ పటేల్ సంతోషం వ్యక్తం చేశారు. అంబేద్కర్ లాంటి ఆదర్శనీయులను గౌరవించేలా ఆద‌ర్శంగా నిలుస్తున్న కొత్త జంటను అభినందించారు.