schedule Friday, September 04, 2026

ఎస్సీ వర్గీకరణకు నిరంతర పోరాటం

calendar_today March 2, 2022
person dharshininews
ఎస్సీ వర్గీకరణకు నిరంతర పోరాటం
ఎస్సీ వర్గీకరణకు నిరంతర పోరాటం - మాదిగ అమర వీరులకు నివాళులు అర్పించిన ఎంఎస్పీ నేతలు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు పోరాటం చేస్తామని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ పెద్దోళ్ల ఆనంద్ కుమార్ మాదిగ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ అనురవీరుల దినత్సోవాన్ని జరుపుకున్నారు. అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంచార్జ్ పెద్దోళ్ల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ అమరుల త్యాగాలు వృధా కాకుండా ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతర పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోలియా దాసరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబదాస్, నాయకులు చందు, మహేందర్, బాల్ రాజ్ హోలియా దాసరి రాజేష్, మహేష్, సురేందర్, హన్మంతు, అశోక్, శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.