schedule Friday, September 04, 2026

బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

calendar_today August 22, 2021
person dharshininews
బండి సంజయ్ పాదయాత్ర వాయిదా
బండి సంజయ్ పాదయాత్ర వాయిదా ద‌ర్శిని ప్ర‌తినిధి : ఈ నెల 24 నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేప‌డుతున్న‌పాదయాత్ర మ‌రోసారి వాయిదా పడింది. భారతీయ జనతా పార్టీ తొలితరం నాయకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌ సింగ్‌ మృతి పట్ల కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నట్లు బండి సంజయ్‌ ప్రకటించారు. దీంతో పాద‌యాత్ర‌ను ర‌ద్దు చేసుకుని పార్టీ పరంగా వారం రోజుల పాటు సంతాపదినాలు పాటిస్తున్నట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా మాజీ సైనికాధికారులు బీజేపీ పార్టీలో చేరే కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసినట్టు వెల్లడించారు. యూపీకి రెండు సార్లు సీఎంగా, రాజస్థాన్‌ గవర్నర్‌గా కళ్యాణ్‌ సింగ్ చేసిన సేవలను బండి సంజ‌య్ గుర్తు చేశారు. ఆయన మరణం భారతీయ జనతా పార్టీకి తీరని లోటని బండి సంజయ్ పేర్కొన్నారు.