schedule Saturday, July 04, 2026

నిరుద్యోగుల‌కు తీపి క‌బురు

calendar_today March 9, 2022
person dharshininews
నిరుద్యోగుల‌కు తీపి క‌బురు
నిరుద్యోగుల‌కు తీపి క‌బురు - రాష్ట్రంలో 91,142 పోస్టుల భర్తీ - అసెంబ్లీలో ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్ ద‌ర్శిని డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు స‌ర్కారు తీపి క‌బురు చెప్పంది. రాష్ట్రంలోని రాష్ట్రంలో 91,142 పోస్టుల భర్తీ చేస్తున్న‌ట్లు, ఇవ్వాల్టీ నుంచి 80,039 పోస్టులకు నోటిఫికేష‌న్ ఇస్తున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. మంగ‌ళ‌వారం రెండో రోజు కొన‌సాగిన అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశంలో సీఎం కేసీఆర్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు లక్షా 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో 18,334 ఖాళీలు, విద్యాశాఖలో 13,086, వైద్యరోగ్యశాఖలో 12,755, ఉన్నతవిద్యాశాఖలో 7,878 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి గ్రూప్ 1, గ్రూప్ 2 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్- 1 లో 503, గ్రూప్ -2లో 582, గ్రూప్-3లో 1373, గ్రూప్-4లో 9168 పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లా స్థాయిలో 18,866, మల్టీజోన్‌లో 13,170 పోస్టులు, అదర్ కేటగిరి వర్సిటీలలో 8,174 పోస్టులు భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు.. శాఖలు, జిల్లాల వారీగా .. -------------------- రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు.. గ్రూప్‌ 1- 503 ఉద్యోగాలు గ్రూప్‌ 2- 1,373 ఉద్యోగాలు గ్రూప్‌ 4- 9168 పోస్టులు క్యాడర్ వారీగా ఖాళీలు.. జిల్లాల్లాలో- 39,829 జోన్లలో- 18,866 మల్టీజోనల్‌ పోస్టులు- 13,170 సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147 జిల్లాల వారీగా ఖాళీలు.. హైదరాబాద్ – 5,268 నిజామాబాద్- 1,976 మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769 రంగారెడ్డి- 1,561 కరీంనగర్- 1,465 నల్లగొండ- 1,398 కామారెడ్డి- 1,340 ఖమ్మం- 1,340 భద్రాద్రి కొత్తగూడెం- 1,316 నాగర్‌కర్నూల్- 1,257 సంగారెడ్డి- 1,243 మహబూబ్‌నగర్- 1,213 ఆదిలాబాద్- 1,193 సిద్దిపేట- 1,178 మహబూబాబాద్- 1,172 హనుమకొండ- 1,157 మెదక్- 1,149 జగిత్యాల- 1,063 మంచిర్యాల- 1,025 యాదాద్రి భువనగిరి- 1,010 జయశంకర్ భూపాలపల్లి- 918 నిర్మల్- 876 వరంగల్- 842 కుమ్రం భీం ఆసీఫాబాద్- 825 పెద్దపల్లి- 800 జనగాం- 760 నారాయణపేట్- 741 వికారాబాద్- 738 సూర్యాపేట- 719 ములుగు- 696 జోగులాంబ గద్వాల- 662 రాజన్న సిరిసిల్లా- 601 వనపర్తి- 556 జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు.. జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు.. జోన్లు.. కాళేశ్వరం జోన్‌లో- 1,630 బాసర జోన్‌- 2,328 రాజన్న జోన్‌- 2,403 భద్రాద్రి జోన్‌- 2,858 యాదాద్రి జోన్‌- 2,160 చార్మినార్ జోన్‌- 5,297 జోగులాంబ జోన్‌- 2,190 మల్టీజోన్లు.. మల్టీజోన్ 1- 6,800 మల్టీజోన్ 2- 6,370 ఏ శాఖలో ఎన్ని.. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు.. హోం శాఖ- 18,334 సెకండరీ ఎడ్యుకేషన్- 13,086 హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755 హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878 బీసీల సంక్షేమం- 4,311 రెవెన్యూ శాఖ- 3,560 ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879 నీటిపారుదల శాఖ- 2,692 ఎస్టీ వెల్ఫేర్- 2,399 మైనారిటీస్ వెల్ఫేర్- 1,825 ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598 పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455 లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221 ఆర్థిక శాఖ- 1,146 మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859 అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801 రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563 న్యాయశాఖ- 386 పశుపోషణ, మత్స్య విభాగం- 353 జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343 ఇండస్ట్రీస్, కామర్స్- 233 యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్- 184 ప్లానింగ్- 136 ఫుడ్, సివిల్ సప్లయిస్- 106 లెజిస్లేచర్- 25 ఎనర్జీ- 16