schedule Saturday, September 05, 2026

నిరుద్యోగ యువతకు సర్కారు భరోసా

calendar_today March 9, 2022
person dharshininews
నిరుద్యోగ యువతకు సర్కారు భరోసా
నిరుద్యోగ యువతకు సర్కారు భరోసా - టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సంబరాలు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ప్రకటనతో నిరుద్యోగ యువతకు భరోసా అందించారని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు జిలాని, దత్తాత్రేయలు పేర్కొన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ 80 వేల 39 ఉద్యోగ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, 11వేల 103 కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రకటన చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం తాండూరు పట్టణంలోని జూనియర్ కళాశాలలో టీఆర్ఎస్వీ డివిజన్ అధ్యక్షులు జిలాని, జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కా సీఆర్ ఒకే రోజు 80వేల ఉద్యోగాల ప్రకటనతో పాటు 11 వేల ఉద్యోగుల రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం చారిత్రాత్మకమన్నారు. రాష్ట్రంలో నిరాశ‌లో ఉన్న నిరుద్యోగుల భవితకు భరోసా అందించారని అన్నారు. ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వానికి రుణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.