schedule Saturday, September 05, 2026

రాజ్ కుమార్‌కు జాతీయ పుర‌స్కారం

calendar_today March 13, 2022
person dharshininews
రాజ్ కుమార్‌కు జాతీయ పుర‌స్కారం
రాజ్ కుమార్‌కు జాతీయ పుర‌స్కారం - జాతీయ అవార్డును అందించిన ఫేమ్ క్ల‌బ్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరుకు చెందిన బీసీ సంక్షేమ సంఘం నాయ‌కులు, యువ వ్యాపార వేత కందుకూరి రాజ్ కుమార్‌కు జాతీయ పుర‌స్కారం ల‌భించింది. ఫేమ్ క్ల‌బ్ ఇంటర్నేష‌న‌ల్ స‌భ్యులు ఆయ‌న‌కు జాతీయ అవార్డును ప్ర‌క‌టించి అంద‌జేశారు. ఆరోగ్య భీమా రంగం, మోటార్ బీమా రంగంలో విశిష్ట సేవ‌ల‌ను అందించినందుకు గాను ఫేమ్ క్ల‌బ్ స‌భ్యులు 2021 యేడాదికి అందించే జాతీయ అవార్డుకు రాజ్ కుమార్‌ను ఎంపిక చేశారు. తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే ఎంపిక కాగా అందులో రాజ్ కుమార్ స్థానం ద‌క్కించుకున్నారు. ముంబై నగరంలోని ఎంబి వాలిలో నిర్వహించిన ఫెమ్ క్లబ్ నేషనల్ అవార్డ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులు రాజ్ కుమార్ కందుకూరికి జాతీయ అవార్డును అంద‌జేశారు. రాజ్ కుమార్‌కు జాతీయ అవార్డు దక్కడం ప‌ట్ల ఆయన స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.