schedule Saturday, July 11, 2026

ఘనంగా హోలీ సంబరాలు

calendar_today March 17, 2022
person dharshininews
ఘనంగా హోలీ సంబరాలు
ఘనంగా హోలీ సంబరాలు - గాంధీనగర్ రంగోలీ ఆడిన కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు పట్టణం గాంధీనగర్‌లో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఈ సంబరాలను నిర్వహించారు. కౌన్సిలర్ సంగీత ఠాకూర్ వార్డులోని అంగన్వాడి కేంద్రంతో పాటు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులతో కలిసి హోలీ సంబరాలను జరుపుకున్నారు. చిన్నారులకు రంగులను పూశారు. స్కూల్లో ఉపాధ్యాయులకు, అంగన్ వాడి కేంద్రంలో మహిళలకు రంగలు చల్లి ఉత్సహాంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోలీ పండగ మన సంస్కృతికి చిహ్నమన్నారు. పండగలను భేదాభిప్రాయాలు లేకుండా సంతోషంగా జరుపుకోవాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉపాధ్యాయురాలు మాధవి, అంగన్ వాడి టీచర్లు రాధ, ఆయ భీమమ్మ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.