schedule Friday, September 04, 2026

సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ.

calendar_today August 25, 2021
person dharshininews
సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ.
సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ.. కొత్త సీపీగా స్టీఫెన్ ర‌వీంద్ర ద‌ర్శిని ప్ర‌తినిధి : సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ప్ర‌భుత్వం బదిలీ చేసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ముత్యాల స్టీఫెన్ రవీంద్రను నియమిస్తున్నట్లు ఆ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స‌జ్జ‌నార్ ప‌లు కీలకమైన కేసులను పరిష్కరించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మహిళల రక్షణకు వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో సజ్జనార్ ఒక్కసారిగా సంచలనంగా మారారు. అంతకుముందు వరంగల్‌లో యాసిడ్ దాడి నిందితుడి ఎన్‌కౌంటర్‌తోనూ ఆయన గుర్తింపు పొందారు.