schedule Monday, September 07, 2026

అధైర్య ప‌డ‌కండి అండ‌గా ఉంటా

calendar_today May 14, 2022
person dharshininews
అధైర్య ప‌డ‌కండి అండ‌గా ఉంటా
అధైర్య ప‌డ‌కండి అండ‌గా ఉంటా - బాధిత కుటుంబాల‌కు ఎమ్మెల్యే ప‌రామ‌ర్శ‌ యాలాల‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఆధైర్య పడ‌కండి అండ‌గా ఉంటానంటూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించారు. యాలాల మండలం అన్నాసాగర్ ఉప సర్పంచ్ పట్లోళ్ల సాయి రెడ్డికి షుగర్ కారణంగా కుడి కాలును మోకాలి వరకు తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కురిసిన వర్షాలకు గంజాయి బసప్ప ఇల్లు కూలిపోయింది. శ‌నివారం విషయం తెలుసుకున్నఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఎలాంటి ఆందోళ‌న చెందొద్ద‌ని, అండ‌గా ఉంటాన‌ని వారిలో ధైర్యాన్ని నింపారు, గంజాయి బ‌స‌ప్ప ఇంటి విష‌యంలో మండ‌ల‌ తహసీల్దార్ కు ఫోన్ చేసి వివరాలు సేకరించి నష్ట పరిహారం అందజేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట యాలాల ఎంపీపీ బాలేశ్వ‌ర్ గుప్త‌, మండ‌ల టీఆర్ఎస్ నాయ‌కులు, గ్రామ పెద్ద‌లు ఉన్నారు.