schedule Saturday, July 04, 2026

కరీంనగర్‌కు సీఎం కేసీఆర్‌..

calendar_today August 27, 2021
person dharshininews
కరీంనగర్‌కు సీఎం కేసీఆర్‌..
కరీంనగర్‌కు సీఎం కేసీఆర్‌.. - నేడు దళిత బంధుపై సమీక్ష ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు కరీంనగర్‌లో పర్యటించనున్నారు. గురువారం రాత్రి హెలికాప్టర్‌లో హన్మకొండ వెళ్లిన సీఎం.. అక్కడ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. అనంతరం రోడ్డు మార్గంలో అక్కడి నుంచి కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో ఉన్న నివాసానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు అలుగునూరులో జరిగే టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు రూప్‌సింగ్‌ కుమార్తె వివాహానికి సీఎం హాజరుకాబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కరీంనగర్‌ కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులతో కలిసి ‘దళితబంధు’ పథకంపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్‌ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు