schedule Thursday, September 17, 2026

ఓటమికి భయపడే గుండాల్లా దాడులు

calendar_today November 2, 2022
person dharshininews
ఓటమికి భయపడే గుండాల్లా దాడులు
ఓటమికి భయపడే గుండాల్లా దాడులు - ఎమ్మెల్యే ఈటెలపై దాడి భౌతిక దాడి హేయం - బీఆర్ఎస్ నేతలపై భగ్గుమన్న బీజేపీ నేతలు - కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం తాండూరు, దర్శని ప్రతినిధి: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుకు భయపడే బీఆర్ఎస్ నేతలు గుండాల్లా దాడులకు పాల్పడుతుందని తాండూరు బీజేపీ భగ్గుమన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నేతలు దాడి చేయడంపై బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్, గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, ఎం.నరేష్ మహరాజ్ లు హాజరయ్యారు. వారి సమక్షంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి భయపడి బీజేపీ నేతలపై దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై దాడులకు పాల్పడడం హేయమని అన్నారు. ఎన్ని కుట్రలు, దాడి చేసిన మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడడం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంగెం హన్మంతు ముదిరాజ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.