schedule Thursday, September 17, 2026

శబరికి బయల్దేరిన అయ్యప్ప స్వాములు

calendar_today November 7, 2022
person dharshininews
శబరికి బయల్దేరిన అయ్యప్ప స్వాములు
శబరికి బయల్దేరిన అయ్యప్ప స్వాములు - తాండూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర తాండూరు, దర్శిని ప్రతినిధి: అయ్యప్ప మాలాధారణలో స్వాములు శబరికి పాదయాత్ర ద్వారా బయల్దేరారు. సోమవారం ఉదయం పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమయ్యింది. తాండూరు నుంచి గురు స్వాములు గోపాల్, నర్సింలు గౌడ్, బషీరాబాద్ నుంచి గురుస్వామి సాయిలుగౌడ్, కరణ్ కోట్ నుంచి గురుస్వామి జంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో 32 మంది అయ్యప్ప స్వామిలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఆలయ నుంచి బయల్దేరి రసూల్ పూర్ హనుమాన్ దేవాలయంలో హారతి స్వీకరణ చేశారు. అక్కడి నుంచి జుంటుపల్లిలో సద్ది పూర్తి చేసుకుని పాదయాత్ర కొనసాగించారు. తాండూరు నుంచి బయల్దేరిన అయ్యప్ప స్వాముల పాదయాత్ర 37 రోజుల పాటు దాదాపు 1200 కిలోమీటర్లు కొనసాగుతుందని తెలిపారు. ఈ పాదయాత్రలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, శ్రీధర్ స్వాములతో పాటు కొత్తగా మాల ధరించిన స్వాములు శబరికి బయల్దేరారు. పాదయాత్రగా బయల్దేరిన స్వాములకు ఆయల కమిటి అధ్యక్షులు వెంకట్ రావు, ఉపాధ్యక్షులు - శ్రావణ్ గౌడ్, గాండ్ల సంగమేష్, ప్రధాన కార్యదర్శులు కేశవరెడ్డి, జైపాల్ రెడ్డి, కోశాధికారులు మనోహర్(స్పైస్), భార్గవి ఫైనాన్ నవీన్, గౌరవాధ్యక్షులు దివాకర్ రెడ్డి, నిర్ది. శేఖర్ లు సహాకారాలు అందించారు. అదేవిధంగా తాండూరుకు చెందిన సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ అయ్యప్ప స్వాముల పూజా కార్యక్రమాలతో పాటు సద్ధి కార్యక్రమాలకు సేవలందించారు. పాదయాత్రగా బయల్దేరిన స్వాముల ఆశీర్వాదాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈర్షాద్. ఇంతియాజ్, విష్ణుయాదవ్, రాజ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.