schedule Thursday, September 17, 2026

స్వాముల పాదయాత్ర @ పది రోజులు పూర్తి

calendar_today November 16, 2022
person dharshininews
స్వాముల పాదయాత్ర @ పది రోజులు పూర్తి
స్వాముల పాదయాత్ర @ పది రోజులు పూర్తి - 32 మంది అయ్యప్ప స్వాముల పాదయాత్ర - డోన్‌లో కలిసిన తాండూరు అయ్యప్ప స్వాములు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నుంచి శబరిమలైకి ఆయ్యప్ప స్వాములు చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా పదిరోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 7వ తేదిన తాండూరు నుంచి గురు స్వాములు గోపాల్, నర్సింలు గౌడ్, బషీరాబాద్ నుంచి గురుస్వామి సాయిలు గౌడ్, కరణ్ కోట్ నుంచి గురుస్వామి జంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో 32 మంది అయ్యప్ప స్వాములు పాదయాత్రగా శబరి బయల్దేరిన విషయం తెలిసిందే. బుధవారం డోన్ నుంచి కాశిరెడ్డి నాయక ఆశ్రమానికి చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్రగా బయల్దేరిన అయ్యప్ప స్వాములను తాండూరుకు చెందిన అయ్యప్ప స్వాములు వారిని పాదయాత్రలో కలుసుకున్నారు. పాదయాత్రలో వారిని పలకరించి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారికి అవసరమైన వస్తువులు, సామాగ్రిని అందజేశారు. అయ్యప్ప స్వామి కృపతో పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని.. శబరిగిరీశుని ఆశీస్సులు మెండుగా ఉండాలని స్వామిని ప్రార్థించారు. అయ్యప్ప స్వాములను కలిసిన వారిలో గురుస్వాములు మనోహర్, భద్ర, వేణు, ఈనాడు రమేష్, రవి తదితరులు ఉన్నారు.