schedule Thursday, September 17, 2026

కార్మికుల బిక్షాటన

calendar_today November 19, 2022
person dharshininews
కార్మికుల బిక్షాటన
కార్మికుల బిక్షాటన - హైకోర్టు ఖర్చుల కోసం - కొనసాగుతున్న కార్మికుల సమ్మె తాండూరు, దర్శిని ప్రతినిధి: పీఆర్సీ అమలు కోసం తాండూరు మున్సిపల్ కార్మికులు సమ్మెను మలుపు తిప్పారు. సమ్మెను కొనసాగిస్తూ శనివారం బిక్షాటన చేపట్టారు. హైకోర్టు ఖర్చుల కోసం కార్మికులు ఈ కార్యక్రమం చేపట్టారు. గత 16 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. 11వ పీఆర్సీ కింద మున్సిపల్ కార్మికులకు 30 శాతం పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మెకు దిగారు. ఇన్ని రోజులు నిరసన చేపట్టిన కార్మికులు బిక్షాటన చేస్తూ ఆవేధన వ్యక్తం చేశారు. కార్మికులు చేపట్టిన బిక్షాటనలో ఏఐటీయూసీ జిల్లా నాయకురాలు విజయలక్ష్మీ పండిత్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కార్మికుల పెంచిన వేతనాలు అమలు కాకపోవడంతో ఇబ్బందులు.. పడుతున్నారని అన్నారు. కార్మికుల ఎజెండా కోర్టులో ఉందంటూ అధికారులు, పాలకులు చెలగాటం ఆడుకోవడం దుర్మార్గమన్నారు. హైకోర్టులో అంశాన్ని తేల్చుకునే ఎందుకు ఖర్చుల కోసం బిక్షాటన చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు పీఆర్సీని అమలు చేయాలని నిరాహార దీక్షను కూడ కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.