schedule Thursday, September 17, 2026

ఫలించిన సునీతమ్మ వైద్య సత్యం

calendar_today November 28, 2022
person dharshininews
ఫలించిన సునీతమ్మ వైద్య సత్యం
ఫలించిన సునీతమ్మ వైద్య సత్యం - ప్రభుత్వ ఆసుపత్రిలో జడ్పిటీసీ భార్యకు పురుడు - సాధారణ ప్రసవంతో మగబిడ్డకు జన్మ - సర్కారు వైద్య సేవలకు మరో రుజువు తాండూరు, దర్శిని ప్రతినిధి: కార్పోరేట్ ఆసుపత్రులకంటే సర్కారు దవాఖానలో పేదలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి సత్యాన్ని చాటారు. తమ అధికార పార్టీకి చెందిన జెడ్పీటీస భార్యకు అందించిన సేవలను ఉదహరించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. దౌల్తాబాద్ జడ్పిటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్ తన భార్య కోట్ల ఆనంది నిండు గర్భిణిగా ఉన్నారు. ప్రసవం కోసం ఆమెను ప్రవేటు ఆసుపత్రిలో సంప్రదించగా ఆమెకు సీజరీయన్ చేయాలని వెల్లడించారు. అయితే మహిపాల్ ఈ విషయాన్నిజెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సర్కారు ఆసుపత్రిలోనే చేర్పించాలని.. కార్పోరేట్‌కు ధీటుగా వైద్య ఉన్నాయని సూచించారు. దీంతో మహిపాల్ జెడ్పీ చైర్ పర్సన్ సూచన మేరకు తన భార్యను తాండూరు ఎంసీహెచ్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సీజరియన్ చేయాలని సూచించారని, కానీ తాండూరు జిల్లా ఆస్పత్రిలో మాత్రం వైద్యులు సాధారణ ప్రసవం చేసారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు ఉన్నాయని, ప్రజలకు తెలియజేయడానికి తాను సునీతారెడ్డి గారి సూచనతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినట్లు మహిపాల్ తెలిపారు. ఈ సంధర్బంగా సునితమ్మకు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.