schedule Thursday, September 17, 2026

పెళ్లి కావడం లేదని..!

calendar_today December 4, 2022
person dharshininews
పెళ్లి కావడం లేదని..!
పెళ్లి కావడం లేదని..! - పురుగుల మందు తాగిన యువకుడు - గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి తాండూరు, దర్శిని ప్రతినిధి: పెళ్లి కావడం లేదని మనస్థాపంలో ఓ యుకుడు పురుగుల మందు సేవించాడు. చికిత్స పొందుతూ మరణించిన సంఘటనపై ఆదివారం పెద్దేముల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలంలోని నర్సమ్మ, నర్సింలు కుమారుడు గోపాల్(21)తో పాటు కూతురు ఉన్నారు. కూతురుకు పెళ్లి కాగా.. గోపాల్‌కు ఇంకా కాలేదు. అయితే తనకు పెండ్లి చేయాలని ఇంట్లో వాళ్లకు పలుసార్లు కోరాడు. కుమారుడికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు కూడ సంబంధాలు చూస్తున్నారు. కానీ తనకు పెళ్లి కావడంలేదని గోపాల్ మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదిన రాత్రి ఇంట్లో ఎవరు లేనిది చూసి గుర్తుతెలియని పురుగుల మందు సేవించాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషయమించడంతో వైద్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో గోపాల్ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పెద్దేముల్ పోలీసులు వెల్లడించారు.