schedule Friday, September 18, 2026

విఠల్ నాయక్‌ ఇంటికి ఎమ్మెల్సీ

calendar_today January 28, 2023
person dharshininews
విఠల్ నాయక్‌ ఇంటికి ఎమ్మెల్సీ
విఠల్ నాయక్‌ ఇంటికి ఎమ్మెల్సీ - తండ్రి మరణంపై సానుభూతి తెలిపిన మహేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ ను ఉమ్మడి రంగా రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. విఠల్ నాయక్ తండ్రి వర్యా.. వాల్యా నాయక్ ఇటీవల కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి శనివారం యాలాల మండలం బాణాపూర్ గ్రామంలో మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ ను కలిసి పరామర్శించారు. తండ్రి మరణంతో బాధలో ఉన్న విఠల్ నాయక్ కు సానుభూతిని ప్రకటించారు. ఎమ్మెల్సీ వెంట బీఆర్ఎస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, బాణాపూర్ సర్పంచ్ బాలిబాయి, రాము నాయక్, నాయకులు రాజు నాయక్, బిర్కడ్ రఘు, నరేష్ కుమార్ తదితరులు ఉన్నారు.