బీజేపీ బూత్ అధ్యక్షుని కుటుంబానికి ఆర్థిక సాయం
July 27, 2023
dharshininews
బీజేపీ బూత్ అధ్యక్షుని కుటుంబానికి ఆర్థిక సాయం
- రూ. 10 వేలు నగదు అందజేసిన మురళీకృష్ణ గౌడ్
- యువమోర్చ తరుపున మరో రూ. 5వేలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని బీజేపీ బూత్ అధ్యక్షుని కుటుంబానికి వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీజేపీ నాయకులు మురళీకృష్ణ గౌడ్ ఆర్థిక సాయం అందించారు. పట్టణంలోని 13 వార్డు బూత్ అధ్యక్షులు వెంకట్ తండ్రి బాలస్వామి అనారోగ్యంతో మరణించారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న మురళీకృష్ణ గౌడ్ రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈసాయాన్ని మురళీకృష్ణ గౌడ్ అదేశాల మేరకు పార్టీ నాయకులు బూత్ అధ్యక్షుని ఇంటికి వెళ్లి అందజేశారు. అదేవి ధంగా బీజేపీ యువమోర్చ తరపున మరో రూ. 5వేలను జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్, పట్టణ బీజేవైఎం అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ స్పోర్ట్స్ కన్వినర్ భానులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యువమోర్చ నాయకులు అనిల్, నరేష్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/18879