schedule Monday, July 06, 2026

కాషాయం కప్పుకున్న లక్ష్మారెడ్డి

calendar_today July 29, 2023
person dharshininews
కాషాయం కప్పుకున్న లక్ష్మారెడ్డి
కాషాయం కప్పుకున్న లక్ష్మారెడ్డి - ఢిల్లీలో కిషన్‌ రెడ్డి సమక్షంలో చేరిక తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. జిల్లాలోని తాండూరు బీఆర్ఎస్ నాయకులు, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి కమలం పార్టీలో చేరి కాషాయం కండువా కప్పుకున్నారు, గత రెండు, మూడు రోజులుగా ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం తాండూరు నియోజకవర్గ సీనీయర్ నాయకులు, డీసీసీబీ మాజీ చైర్మన్, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రుద్రారం లక్ష్మారెడ్డి బీజేపీలో చేశారు. దేశ రాజధానిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ సమక్షంలో బిజెపి పార్టీలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వికారాబాద్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ మరియు రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18913 chaithany collage