schedule Monday, July 06, 2026

దర్శిని ఎఫెక్ట్..!

calendar_today August 1, 2023
person dharshininews
దర్శిని ఎఫెక్ట్..!
దర్శిని ఎఫెక్ట్..! - వేగంగా రోడ్డు డ్రైనేజీకి మరమ్మత్తులు - మురుగు పారేందుకు అధికారుల చర్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి: జాతీయ రోడ్డుకు మురుగు మకిలీ దర్శిని కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం స్పెషల్‌ డ్రైవ్ కార్యక్రమంతో మరమ్మత్తుల పనులు చేపట్టారు. తాండూరు పట్టణంలోని బస్టాండ్ రోడ్డు నుంచి ఇందిరా చౌరస్తా వైపు వెళ్లే జాతీయ రహదారి అనుసంధానమైన రోడ్డుకు డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థంగా మారడంతో మురుగు రోడ్లపై పారిన సంగతి తెలిసిందే. రోడ్డుపై మురుగు పారడంతో వాహనదారుల, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని దర్శినిలో కథనం రావడంతో మున్సిపల్ అధికారులు స్పందించారు. స్వయంగా మున్సిపల్ కమీషనర్ షఫీవుల్లా దగ్గరుండి స్పెషల్ డ్రైవ్‌ కింద మురుగు సమస్యకు పరిష్కార పనులు చేపట్టారు. ఇందిరా చౌరస్తా నుంచి ఉన్న మురుగు కాలువలో మట్టిని తొలగించే పనులు చేపట్టారు. జేసీబీ యంత్రంతో మురుగు కాలువలో మరమ్మత్తులు పనులు చేపట్టారు. మున్సిపల్ కార్మికులు డ్రైనేజీని మరమ్మత్తులు చేపట్టి మురుగు పారేందుకు చర్యలు చేపట్టారు. మురుగు సమస్యను పరిష్కరించడం పట్ల మున్సిపల్‌ అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానీటరీ ఇనుస్పెక్టర్లు ఉమేష్‌ కుమార్, క్రిష్ణయ్య, జవాన్లు, కార్మికులు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18961