schedule Monday, July 06, 2026

తాండూరు సమగ్రాభివృద్ధి చెందాలి

calendar_today August 1, 2023
person dharshininews
తాండూరు సమగ్రాభివృద్ధి చెందాలి
తాండూరు సమగ్రాభివృద్ధి చెందాలి - ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మంచి జరగాలి - మణిపూర్ క్రైస్తవులకు మద్దతుగా ఐక్య ప్రార్ధనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సమగ్ర అభివృద్ధి చెందాలని, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి మంచి జరగాలని తాండూరు క్రైస్తవులు ప్రార్ధించారు. మంగళవారం తాండూరు బీఆర్ఎస్ నాయకులు, క్రిస్టియన్ కమ్యూనిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. విజయ్ కుమార్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు సారంగ విజయ్ ఆధ్వర్యంలో తాండూరు యునైటెడ్ ప్రేయర్ ఫెలోషిఫ్ ద్వారా ఐక్య ప్రార్థనలు నిర్వహించారు. విలియన్ మూన్ గ్రౌండ్ లోని న్యూ మెథడిస్ట్ సెంట్రల్ చర్చిలో ఈ ప్రార్థనలు నిర్వహించారు. తాండూరు పట్టణం సమగ్ర అభివృద్ధి చెందాలని, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి మంచి జరగాలని క్రైస్తవులు ప్రార్ధనలు చేశారు. అదేవిధంగా మణిపూర్ లో క్రైస్తవులకు మద్దతుగా కూడా ప్రార్థనలు చేశారు. క్రైస్తవులు, చెర్చిలపై జరుగుతున్న దాడులలో బాధ్యతులపై చర్యలు తీసుకోవాలని, వారికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు విలియమూన్ గ్రౌండ్‌లో నిర్మిస్తున్న న్యూ మెథడిస్ట్‌ చర్చి నిర్మాణం కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ పాస్టర్లు కె.జనార్ధన్ డీఎస్, నజరేత్ కె. అశోక్ పాస్టర్, ఎస్. ప్రతాప సింగ్ పాస్టర్, ఏసురత్నం పాస్టర్, అశోక్ రాజ్ పాస్టర్, కె.దేవదాస్ పాస్టర్, చెర్చి మెంబర్లు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18970