schedule Monday, July 06, 2026

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దకు పోరాటం

calendar_today August 3, 2023
person dharshininews
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దకు పోరాటం
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దకు పోరాటం - వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం - విశ్వరూప మహాసభను జయప్రదం చేయాలి - ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపన అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత సాధించుకునేంత వరకు మాదిగలు ఉద్యమించాల్సిన అవసరముందని, ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ లో మాదిగల విశ్వరూప మహాసభ సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ దశాబ్దాలుగా పోరాటం చేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ లేని సమయంలో మాదిగలు ఉద్యోగాలు సాధించారని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణను రద్దు చేయడంతో మాదిగలు వెనుకబాటుకు గురయ్యారని, మళ్లీ ఎస్సీ వర్గీకరణ చేస్తేనే మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇందుకోసం కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలపై ఒత్తిడి తేవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధనకు అందరు కృషి చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు సాధించుకుని దానికి చట్టబద్దత కల్పించుకోవడమే. ధ్యేయమన్నారు. వచ్చే వారంలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మాదిగల విశ్వరూప మహాసభకు మాదిగలంతా ఇళ్లకు తాళాలు వేసుకుని సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19022