schedule Monday, July 06, 2026

గూడు లేని పేదలకు వరం..!

calendar_today August 8, 2023
person dharshininews
గూడు లేని పేదలకు వరం..!
గూడు లేని పేదలకు వరం..! - గృహలక్ష్మీకి దరఖాస్తులు చేసుకోండి - మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి: గూడు లేని పేదలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గృహలక్ష్మీ పథకం వరం లాంటిదని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. మంగళవారం ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ అర్హులైన పేదలు గృహలక్ష్మీ పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సొంతంగా స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోవాలన్న పేదల కలలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ గృహలక్ష్మీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. ఈ పథకంలో భాగంగా సొంతింటి నిర్మాణానికి రూ. 3లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని అన్నారు. పూర్తిగా ఇళ్లు లేని పేదలు, గుడిసెలలో జీవనం సాగించే వారు, ఇళ్లు కూలిపోయిన వారు, అద్దె ఇంట్లో ఉండేవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తాండూరు పట్టణంలోని అర్హులైన లబ్దిదారులు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా కేటాయించిన కేంద్రంలో దరఖాస్తులను సమర్పించాలని అన్నారు. పేదలకు వరంలాంటి ఈ అవకాశన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గృహలక్ష్మీ పథకానికి దరఖాస్తు చేసుకోండిలా.. ఈ పథకానికి మహిళలు మాత్రమే అర్హులు. ఒకవేళ మహిళల పేరుమీద సొంత ఇంటిజాగా లేకుంటే.. కుటుంబ సభ్యుల పేరుమీద ఉన్న స్థలంపై తమకు హక్కులు ఉన్నాయని పేర్కొంటూ.. స్వీయ ధృవీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది. కావాల్సిన సర్టిఫికేట్లు ఇవే.. 1.ఆధార్ కార్డు 2.ఫుడ్ సెక్యూరిటీ కార్డు(రేషన్ కార్డు) 3.కులం ధ్రువీకరణ పత్రం 4.నివాస ధ్రువీకరణ పత్రం 5.సొంత ఇంటి స్థలం కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఒకవేళ వికలాంగులు అయితే సదరం సర్టిఫికెట్ పైన పేర్కొన్న సర్టిఫికేట్లు జతచేసి ఎంపీడీవో కార్యాలయంలో ఆగస్టు 10వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలి. ఆగస్ట్ 15 నుంచి లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19137