schedule Monday, July 06, 2026

ఎమ్మెల్సీగా డా. దాసోజు శ్రావణ్ ఎన్నిక హర్షణీయం

calendar_today August 13, 2023
person dharshininews
ఎమ్మెల్సీగా డా. దాసోజు శ్రావణ్ ఎన్నిక హర్షణీయం
ఎమ్మెల్సీగా డా. దాసోజు శ్రావణ్ ఎన్నిక హర్షణీయం - కలిసి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర బహుజన బిడ్డ, తెలంగాణ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ నాయకులు డా. దాసోజు శ్రీనివాస్ ను ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. ఇటీవల గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా దాసోజు శ్రావణి ఎన్నికైన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో రాజ్ కుమార్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా, పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తాండూరుకు చెందిన హైదరాబాద్ నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ జె. మధుసూదన్ రావు, దాసోజు శ్రావణ్ లు పోలీసుశాఖలో, రాజకీయాల్లో రాణించడం గర్వకారణమన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా డా.దాసోజు శ్రావణ్ ఎన్నిక హర్షణీయమన్నారు. బహుజనుల పక్షానా దాసోజు శ్రావణ్ వాణి వినిపించడం ఖాయమన్నారు. మరోవైపు రాజ్ కుమార్ దాసోజు శ్రావణ్ ను సన్మానించడంతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మధుసూదన్ రావు, నాయకులు హరీష్ గౌడ్, శ్రీశైలం తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/19281