schedule Monday, July 06, 2026

గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!

calendar_today August 20, 2023
person dharshininews
గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!
గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..! - 43 పనులకు రూ.61.40 కోట్లు - ఎమ్మెల్యే 'పైలెట్' ప్రతి పాదనలకు ఆమోదం - జీఓ జారీ చేసిన ప్రభుత్వం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం లోని నాలుగు మండలాల పరిధిలోని గ్రామీణ రోడ్లకు కొత్త శోభ రానుంది. ఆయా మండలాల్లోని గ్రామాలను అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేసే రోడ్డు మార్గాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రతిపదించిన గ్రామీణ రోడ్ల అభివృద్ధకి పంచాయతీ రాజ్ శాఖ నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు జీఓ 431ను జారీ చేసింది. తాండూరు నియోజకవర్గంలోని 43 రోడ్డు పనులకు రూ.61.40 కోట్లు మంజూరు చేశారు. పెద్దేముల్ మండల పరిధిలోని 18 గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.21.32 కోట్లు, తాండూరు మండల పరిధిలోని 12 రోడ్డు పనులకు రూ.19.40 కోట్లు, యాలాల మండలంలోని 9 రోడ్డు పనులకు రూ.14.42 కోట్లు, బషీరాబాద్ మండలంలోని 4 రోడ్డు మార్గాల అభివృద్ధికి రూ.6.20 కోట్లు మంజూరు అయ్యాయి. సీఆర్ఆర్ కింద ఈ నిధులు మంజూరు అయ్యాయి. ప్రతిపదించిన అన్ని రోడ్డు పనులకు సీఆర్ఆర్ కింద నిధులు మంజూరు చేసిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని పలు ముఖ్యమైన గ్రామీణ రోడ్డు మార్గాల అభివృద్ధికి నిధులు మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.