schedule Monday, July 06, 2026

అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు

calendar_today August 20, 2023
person dharshininews
అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు
అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు - దళిత బందు, బీసీ బంధు సాధనకు కృషి - టీయూడబ్ల్యూ ఐజేయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, సంక్షేమ పథకాల సాధనకు టీయూడబ్ల్యూజే ఐజేయూ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌ చారి, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్‌లు అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా స్థాయి కార్యవర్గ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి నియోజకవర్గ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, శ్రీధర్‌లు మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల మంజూరు విషయంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ కట్టుబడి కృషి చేస్తుందన్నారు. వికారాబాద్, పరిగి నియోజకవర్గాలకు స్థలాల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తి కావచ్చిందన్నారు. తాండూరు, కోడంగల్ నియోజకవర్గాలు వెనుకబడి ఉన్నాయని, ఆయా నియోజకవర్గాల్లో ఇండ్ల స్థలాల సాధన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికి యూనియన్లకు అతీతంగా ఇండ్ల స్థలాలు సాధించుకోవడమే ధ్యేయమన్నారు. అదేవిధంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, సర్కారు అమలు చేస్తున్న దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మీ పథకాలతో సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి జర్నలిస్టులకు అమలు కావాల్సిన సంక్షేమ పథకాలు, డిమాండ్ల సాధనకు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి డీ. రామకృష్ణ, తాండూరు నియోజకవర్గ మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సింలు, పటేల్ నరేందర్(లిట్టు), జిల్లా నాయకులు శివ కుమార్, పి.సుక్కయ్య, గైబులు, రవీందర్, బుచ్చప్ప, ప్రమోద్, శ్రీకాంత్, లక్ష్మణ్, నరసింహులు, వెంకటేష్, రత్నం, తాండూరు మండల అధ్యక్షులు సంగమేశ్వర్, పట్టణ ప్రధాన కార్యదర్శి మహేష్‌, వికారాబాద్ నియోజకవర్గ కోశాధికారి అశోక్ కుమార్, పెద్దేముల్ మండల యూనియన్ జర్నలిస్టులు పాండు, గయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19466