schedule Monday, July 06, 2026

పైలెట్‌ జయకేతనం పక్కా..!

calendar_today August 21, 2023
person dharshininews
పైలెట్‌ జయకేతనం పక్కా..!
పైలెట్‌ జయకేతనం పక్కా..! - తాండూరు ఎమ్మెల్యే టిక్కెట్టు హర్షణీయం - రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏఎంసి చైర్మన్ విట్టల్ నాయక్ తాండూరు, దరన్శిని ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పైలెట్ రోహిత్ రెడ్డి జయకేతనం తప్పదని వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించిన తొలిజాబితాలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తాండూరు టిక్కెట్ కేటాయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. టిక్కెట్ సొంతం చేసుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మాట్లాడుతూ యువ నాయకుడిగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూర్ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధికి కృషి చేస్తున్న రోహిత్ రెడ్డికి బిఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడం సంతోషకరమని అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ని తాండూరు ప్రజలు భారీ మెజారిటీ తో గెలిపించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. వచ్చే ప్రభుత్వంలో రోహిత్ రెడ్డి మంత్రిగా అవ్వడం కూడా ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19513