వరలక్ష్మీ నమోస్తుతే...!
August 25, 2023
dharshininews
వరలక్ష్మీ నమోస్తుతే...!
- ఇంటింటా వ్రత వైభోగం
-ఎమ్మెల్యే నివాసంలో పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వరలక్ష్మీ నమోస్తుతే అంటూ మహిళలు తల్లిని కొలిచారు. శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా తాండూరు పట్టణంలో వరలక్ష్మీ వ్రతాలు వైభంగా జరిగాయి. మహిళలు తమ తమ ఇండ్లలో వెలసిన లక్ష్మీ మాతకు పూజలు నిర్వహించి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. పట్టణంలోని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో తల్లి వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి వరలక్ష్మీ పత్రాన్ని చేపట్టారు. పురోహితుని సమక్షంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీలోని మహిళలతో కలిసి వ్రతం మొక్కులను తీర్చుకున్నారు.
మరోవైపు పట్టణంలోని పలువురు ప్రముఖుల నివాసాల్లో కూడా వరలక్ష్మీ వ్రతాన్ని వైభోగంగా జరుపుకున్నారు. పూజలకు మహిళలను ఆహ్వానించి వాయినాలను సమర్పించుకున్నారు. దీంతో తెలుగు ఇళ్లల్లో వరలక్ష్మీ వ్రత శోభ సంతరించుకుంది.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/19636