ఎల్లమ్మకు గాజుల అలంకరణ
August 25, 2023
dharshininews
ఎల్లమ్మకు గాజుల అలంకరణ
- ప్రత్యేకంగా దర్శనమిచ్చిన అమ్మవారు
- పూజలు నిర్వహించిన భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నెహ్రు గంజ్‌లో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రావణమాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయంలో వెలసిన అమ్మవారికి గాజులతో అలంకరణ చేశారు. ప్రతి యేడాది ఆషాడమాసం, శ్రావణమాసం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితి. ఇందులో భాగంగా అమ్మవారికి గాజులతో అలంకరణ చేశారు. రంగు రంగుల గాజుల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/19641