చెరువెంటి ఈశ్వరాలయానికి రారండి..!
August 25, 2023
dharshininews
చెరువెంటి ఈశ్వరాలయానికి రారండి..!
- రేపటి నుంచి అభయాంజనేయ విగ్రహ ప్రతిష్తాపన ఉత్సవాలు
- నవగ్రహాలు, నాగదేవతల విగ్రహాలు కూడా
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి చించొల్లి రోడ్డు మార్గం బసవేశ్వనగర్‌లోని చెరువెంటి ఈశ్వరాలయానికి భక్తులు తరలిరావాలని ఆలయ కమిటి అధ్యక్షులు వాలి శాంతుకుమార్, కార్యదర్శి జొన్నల బస్వరాజ్, కమిటి సభ్యులు కోరారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో రేపు శనివారం నుంచి ఆలయంలో విగ్రహప్రతిష్టాపన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో అభయాంజనేయ విగ్రహంతో పాటు నవగ్రహాలు, నాగదేవతల విగ్రహా ప్రతిష్టాపన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు శనివారం మహాగణపతి పూజ, యాగశాల స్థాపిత అంకురార్పణ, నంది సమారాధన, ధ్వజారోహణం, జలాధివాసం, నీరాజన మంత్రపుష్పం, ఆదివారం నవగ్రహాల పూజ, సోమవారం ఉదయం 8-21గంటల సుముహూర్తములో యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే సహాకారంతో మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కావున భక్తులు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొని ఈశ్వరుని కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/19646