schedule Monday, July 06, 2026

గుర్తుతెలియని లారీ ఢీకొని వ్యక్తి మృతి

calendar_today August 27, 2023
person dharshininews
గుర్తుతెలియని లారీ ఢీకొని వ్యక్తి మృతి
గుర్తుతెలియని లారీ ఢీకొని వ్యక్తి మృతి - కరణ్ కోట్ గ్రామంలో సంఘటన - కేసు నమోదు చేసిన పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రోడ్డు వద్ద నిలబడి ఉన్న వ్యక్తిని గుర్తుతెలియని లారీ ఢీ కొనడంతో గాయాలపాలయ్యాడు. గమనించిన కుటుంభీకులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో చోటు చేసుకుంది. కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరన్ కోట్ గ్రామానికి చెందిన సాధిక్ హుస్సేన్(34) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సాధిక్ ఆదివారం ఉదయం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉన్న ఓగిపూర్ నుంచి గౌతాపూర్ వెళ్లే రోడ్డు మార్గంలో నిలబడి ఉన్నాడు. అదే సమయంలో అటువైపు వెళుతున్న ఓ గుర్తుతెలియని లారీ సాధిక్ ను ఢీకొట్టింది. దీంతో అతని ఎడమ కాలు, కుడి నడుము భాగంలో ఎముకలు విరిగి అక్కడే కుప్పకూలి పోయాడు. గమనించిన సాధిక్ అల్లుడు ఖాసిం అతన్ని చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమద్యలో సాధిక్ మృతి చెందినట్లు కుటుంభీకులు తెలిపారు. మృతుని భార్య సలీమా భేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇది కూడా చదవండి.... https://dharshininews.com/19715