schedule Monday, July 06, 2026

మంత్రి, ఎమ్మెల్యే కలయిక కుట్రే..!

calendar_today September 10, 2023
person dharshininews
మంత్రి, ఎమ్మెల్యే కలయిక కుట్రే..!
మంత్రి, ఎమ్మెల్యే కలయిక కుట్రే..! - బీజేపీకి భయపడే ఇద్దరు ఒక్కటయ్యారు - ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓటమి తప్పదు - బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల కలయిక కుట్రలో భాగమే అని బీజేపీ అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్ విమర్శించారు. తాండూరులో శనివారం జరిగిన సమావేశంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు చేసిన వాఖ్యలను ఖండించారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ బీజేపీకి భయపడే మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు ఒక్కటయ్యారని అన్నారు. తాండూరు ప్రాంతాన్ని దోచుకునేందుకు కుట్ర. చేస్తున్నారని అన్నారు. నమ్ముకుని కార్యకర్తలను నిండా ముంచి చప్పట్లు కొట్టించుకున్నంత మాత్రానా గెలుపొందలేరన్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు కలిసినంత మాత్రానా సహకరిస్తారని అనుకోవడం బ్రమ అని అన్నారు. ఈ పరిణామాలతో ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. రానున్న రోజల్లో బీఆర్ఎస్ ఓటమి తప్పదని అన్నారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/20136/