schedule Monday, July 06, 2026

ఎమ్మెల్యే పోటీకి కౌన్సిలర్‌ సై..!

calendar_today September 10, 2023
person dharshininews
ఎమ్మెల్యే పోటీకి కౌన్సిలర్‌ సై..!
ఎమ్మెల్యే పోటీకి కౌన్సిలర్‌ సై..! - దరఖాస్తు అందజేసిన సాహు శ్రీలత - బీజేపీ తాండూరు స్థానానికి విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి: కౌన్సిలర్‌ పదవిలో ఉన్న బీజేపీ మహిళ నాయకురాలు ఎమ్మెల్యే పోటీకి సై అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని దరఖాస్తును అందజేశారు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్‌ పరిధిలో 24 వార్డు బీజేపీ కౌన్సిలర్‌గా సాహు శ్రీలత లక్ష్మీకాంత్ కొనసాగుతున్నారు. బీజేపీ పార్టీలో వికారాబాద్‌ జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో పార్టీ కమిటి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ నేపథ్యంతో సాహు శ్రీలత తాండూరు అసెంబ్లీ ఎమ్మెల్యే పోటీకి సిద్దమయ్యారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని ఆదివారం పార్టీ కార్యాలయంలో దరఖాస్తును అందజేశారు. మరోవైపు తాండూరు అసెంబ్లీ స్థానానికి బీజేపీ నుంచి అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ఇప్పటికే అభ్యర్థులుగా పటేల్ రవిశంకర్, పటేల్ జయశ్రీ దంపతులతోపాటు లక్ష్మారెడ్డి, యు.రమేష్‌ కుమార్, మురళీకృష్ణ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఈ జాబితాలో సాహు శ్రీలత కూడా చేరిపోయారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20139/