schedule Monday, July 06, 2026

మార్కెట్ కమిటీ పాలక వర్గానికి పచ్చజెండా

calendar_today September 12, 2023
person dharshininews
మార్కెట్ కమిటీ పాలక వర్గానికి పచ్చజెండా
మార్కెట్ కమిటీ పాలక వర్గానికి పచ్చజెండా - నూతన చైర్ పర్సన్‌గా గద్దె వీణా శ్రీనివాస్ చారి - వైస్ చైర్మన్, డైరెక్టర్ల నియామాకం తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మార్కెట్ కమిటికి కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మార్కెట్ కమిటి చైర్ పర్సన్‌గా తాండూరు పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి సతీమణి గద్దె వీణాకు అవకాశం కల్పించారు. అదేవిధంగా వైస్ చైర్మన్ గా చంద్రవంచ గ్రామానికి చెందిన యువ నాయకుడు ఉమాశంకర్ పటేల్ నియామకం అయ్యారు. వారితో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా హరిహర గౌడ్, షేక్ కాసిం అలి, మ్యతరి ప్రకాశం, కుర్వ బీమ్మప్ప, యూ.గోపాల్ రెడ్డి, ఎండి.ముస్తఫా, గోవింద్ నాయక్, అర్పుల వెంకటప్ప, మంత్రి వెంకటయ్య, జట్టిగాల్ల శ్రీనివాస్, భాను ప్రసాద్, ప్రశాంత్ గౌడ్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు మార్కెట్ ను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఇందుకు తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. మరోవైపు మార్కెట్ కమిటి నూతన పాలకవర్గానికి నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20186/