schedule Monday, July 06, 2026

ఓటరు నమోదుకు నేతలు సహకరించాలి

calendar_today September 13, 2023
person dharshininews
ఓటరు నమోదుకు నేతలు సహకరించాలి
ఓటరు నమోదుకు నేతలు సహకరించాలి - - 18 ఏండ్లు నిండిన వారితో నమోదు చేయించాలి - తాండూరు ఆర్డీఓ ఎం.శ్రీనివాస్ రావు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఓటరు నమోదుకు అన్నీ రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని తాండూరు ఆర్డీఓ, నియోజకవర్గ ఎన్నికల అధికారి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం తాండూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తారాసింగ్ అధ్యక్షతన రాజకీయ పార్టీల అధ్యక్షులు, ఇంచార్జులు, నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వయోజనులతో ఓటురు నమోదు చేయించేందుకు పార్టీల నాయకులు సహకరించాలన్నారు. 18 ఏండ్లు నిండిన యువతీ, యువకులతో కొత్త ఓటర్ల నమోదుతో పాటు పాత వాటిలో మార్పులపై ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. డబుల్ ఓటర్లు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపుకు సహాకారం అందించాలన్నారు. వచ్చేనెల 1వ తేది లోపు 18 ఏండ్లు నిండిన వారితో తప్పక ఓటరు నమోదు చేయించేలా దృష్టి సారించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, టీజేఎస్ ఇంచార్జ్ సోమశేఖర్, నాయకులు బంటారం భద్రేశ్వర్, దోమకృష్ణ, బీఎస్పీ నాయకులు ప్రవీణ్, అధికారులు మునీరోద్దీన్, పద్మావతి, వెంకటస్వామి, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఆర్ఐ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20216/