schedule Monday, July 06, 2026

ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం

calendar_today September 15, 2023
person dharshininews
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం - పార్టీని మోసం చేసినోళ్లను తుక్కుగా ఓడించాలి - జయభేరి సభకు భారీగా తరలిరావాలి - మాజీ మంత్రి చెన్నారెడ్డి, స్ట్రాటజీ కమిటి సభ్యులు కేఎల్‌ఆర్ తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడమే ధ్యేయంగా పనిచేయాలని మాజీ మంత్రి చెన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కమిటి సభ్యులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్‌ఆర్)లు అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావే శానికి మాజీ మంత్రి చెన్నారెడ్డి, కేఎస్ఆర్లు టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, జయభేరీ ప్రోగ్రాం ఇంచార్జ్ సత్యనారాయణరెడ్డిలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చెప్పినా చేసి తీరుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలో తెలిపేందుకు ఈనెల 17న తుక్కుగూడలో జయభేరీ బహిరంగ సభను నిర్వహిస్తోందన్నారు. ఈ సభలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ పథకాలను సోనియాగాంధీ ప్రకటించడం జరుగుతుందన్నారు. కేఎల్‌ఆర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి పార్టీని పిరాయించిన నేతలను ఓడించడమే రాహుల్ గాంధీ కల అని తెలిపారు. ఇందులో భాగంగా తాండూరులో కాంగ్రెస్ ను మోసం చేసిన ఎమ్మెల్యేను తుక్కు తుక్కుగా ఓడించడమే ధ్యేయమన్నారు. దీంతో పాటు 16న సీడబ్ల్యూసీ సమావేశం, 17న జయభేరీ, 18న కార్యకర్తల సమావేశం జరుగుతాయన్నారు. 17న తాండూరు నియోజకవర్గంలో ఇతర రాష్ట్రా నికి చెందిన ముఖ్యమంత్రి లేదా సీఎల్పీ, సీడబ్ల్యూసీ సభ్యులు భస ఉంటుందన్నారు. 18న నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీ పథకాలను ప్రతి ఇంటికి చేరే వేసేలా క్షేత్రస్థాయి కార్యక్రమాలు జరుగుతాయని, వాటిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. టిక్కెట్టు కాదు గెలుపే ముఖ్యం వచ్చే ఎన్నికల్లో తాండూరులో కాంగ్రెస్ పార్టీ గెలుపే తనకు ముఖ్యమని కేఎల్ఆర్ అన్నారు. ఇక్కడా ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా తానే ఇంచార్జ్ గా వస్తానని, ఎమ్మెలె. నేను ఓడించేందుకు ఎత్తుగడలు. బీఆర్ఎస్ ను కట్టడి చేయడమే ధ్యేయమన్నారు. మరోవైపు తాండూరు అసెంబ్లీ బరిలో పోటీలో నిలవడం ఖాయమని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జనార్ధన్ రెడ్డి, ఉత్తమ్ చంద్, ఎంఏ అలీం. పి.బస్వరాజ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మధుబాల, కౌన్సిలర్ మమత, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, మహిళ నాయకురాలు శోభారాణి, నాయకులు కోర్వార్ నగేష్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20251/