schedule Monday, July 06, 2026

ప్రశాంతం వినాయక నిమజ్జనం

calendar_today September 23, 2023
person dharshininews
ప్రశాంతం వినాయక నిమజ్జనం
ప్రశాంతం వినాయక నిమజ్జనం - సహకరించిన అందరికీ కృతజ్ఞతలు - హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో కనివిని ఎరుగని రీతిలో వినాయక నిమజ్జనం సంపూర్ణం, ప్రశాతం అయ్యింది. ఇందుకు సహకరించిన వారందరికి హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు కృతజ్ఞతలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఐదు రోజుల పాటు వినాయకున్ని పూజించి శుక్రవారం నిమజ్జనానికి తరలించారు. ఇందుకు హిందూ ఉత్సవ సమితి తరుపున అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. నిమజ్జనానికి వినాయకులను యాలాల మండలం కోకట్ కాగ్నానదికి తరలించేందుకు హిందూ ఉత్సవ సమితి తరుపున విశేష కృషి చేశారు. వినాయక నిమజ్జనం ప్రశాతంగా జరుపుకునేందుకు సహకరించడంపై శనివారం హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, అధ్యక్షురాలు, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ల తరుపున సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు వినాయక ఉత్సవ సమితి సభ్యులకు, పట్టణ ప్రజలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. నిమజ్జన వేడుకలలో పాల్గొన్న మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, నేతలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నిమజ్జనం ఉత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, డీఎస్సీ శేఖర్ గౌడ్, సీఐలు రాజేందర్ రెడ్డి, రాంబాబు, ఎస్ ఐలు, పోలీసు సిబ్బందికి, విద్యుత్, రెవెన్యూ, ఫైర్ శాఖల అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/20506/