ట్రాఫిక్ పోలీస్టేషన్‌కు ముహుర్తం ఖరారు
September 25, 2023
dharshininews
ట్రాఫిక్ పోలీస్టేషన్‌కు ముహుర్తం ఖరారు
- ఎల్లుండి ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు
- ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వ్యాపార కేంద్రంగా ఉన్న తాండూరులో ప్రజలకు ఇబ్బందికరంగా మారిన ట్రాఫిక్ చిక్కులు తొలగిపోతున్నాయి. ఎందుకంటే తాండూరు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్టేషన్ ఏర్పాటు కాబోతుంది. ఇందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పోలీస్టేషన్ లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. ఇక నుంచి ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించనుంది. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్టేషన్ కోసం రూ. 10 లక్షలు నిధులు కేటాయించారు.పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న ఈ సేవా భవనాన్ని ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌గా ఎంపిక చేశారు. పోలీసు అధికారుల విజ్ఞప్తి మేరకు పురపాలక సంఘం అధికారులు ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు అప్పగించాలని నిర్ణియించారు.
ఈ అంశంపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ మేరకు అప్పటి ఆర్డీఓ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మార్చిలో లేఖను అందజేశారు. అప్పటి నుంచి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన అంశాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్వర్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు చేశారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రత్యేకంగా ఎస్‌ఐతో పాటు ఇతర సిబ్బందిని నియమించనున్నారు. ప్రస్తుతం భవనంలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇదికూడా చదవండి...
https://dharshininews.com/20572/