schedule Monday, July 06, 2026

రోడ్డు విస్తరణకు ఒకే చెప్పండి..!

calendar_today September 25, 2023
person dharshininews
రోడ్డు విస్తరణకు ఒకే చెప్పండి..!
రోడ్డు విస్తరణకు ఒకే చెప్పండి..! - ప్రభుత్వం నుంచి విలువైన పరిహారం ఇస్తాం - తాండూరు ఆర్డీఓ ఎం.శ్రీనివాస్ రావు వెల్లడి - స్టేషన్ రోడ్డు భూ బాధితులతో చర్చలు తాండూరు, దర్శిని ప్రతినిధి: రోడ్డు విస్తరణకు ఓకే చెప్తే ప్రభుత్వం నుంచి విలువైన ఆర్థిక సాయం అందించేలా చూస్తామని తాండూరు ఆర్డీఓ ఎం. శ్రీనివాస్ రావు అన్నారు. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉన్న 40 ఫీట్ల రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న యజమానులతో సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ శ్రీనివాస్ రావు జిల్లా గ్రంథాలయ సంస్క చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ ఈ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తహసీల్దార్ తారాసింగ్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న యజమానులతో చర్చలు జరిపారు. 40 ఫీట్ల రోడ్డు విస్తరణలో దుకాణాలు, ఓపెన్ ప్లాట్లు కోల్పోతున్న వారి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం ఆ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న యజమానులకు ప్రభుత్వ మార్కెట్ ధరకు మూడు రెట్లు ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ లు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న రోడ్డు విస్తరణకు అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు శ్రీనివాస్ చారి. మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, భూ యజమానులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/20590/