schedule Monday, July 06, 2026

సీనియర్ సిటిజన్స్ హక్కుల సాధనే ధ్యేయం

calendar_today September 25, 2023
person dharshininews
సీనియర్ సిటిజన్స్ హక్కుల సాధనే ధ్యేయం
సీనియర్ సిటిజన్స్ హక్కుల సాధనే ధ్యేయం - టీఏఎస్సీఏ తాండూరు కార్యవర్గం ఎన్నిక - అధ్యక్షులుగా విశ్రాంత ఎంఈఓ ఆకారపు శివకుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సీనియర్ సిటిజన్స్ హక్కుల సాధనే తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్(టీఏఎస్సీఏ) ధ్యేయమని అసోసియేషన్ నేతలు అన్నారు. సోమవారం తాండూరులోని విశ్రాంత ఉద్యోగుల సంఘం(పెన్షనర్స్) కార్యాలయంలో టీఏఎస్సీఏ తాండూరు శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాణిక్ ప్రభు, జాకారెడ్డిల సమక్షంలో ఎన్నికల అధికారులు బుచ్చయ్య, ఆకారపు శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. టీఏఎస్సీఏ తాండూరు అధ్యక్షులుగా ఆకారపు శివకుమార్, ఉపాధ్యక్షులుగా భీంశెట్టి మధుసూదన్, కార్యదర్శిగా కె. ప్రకాష్, సంయుక్త కార్యదర్శిగా ఎం. మల్లేశం, కోశాధికారిగా సడిగి బస్వరాజ్, కార్యవర్గ సభ్యులుగా బంటు నర్సింలు, రఘువీర్ సింగ్, ఉదయ శంకర్ పటేల్, ఆర్. జ్ఞానేశ్వర్, గాజుల బస్వరాజ్, ప్యాట నారాయణ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ హక్కుల సాధనే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పద్మనాభం, జొన్నల బస్వరాజ్, ఈశ్వరప్ప, గోపాల్ రెడ్డి, దివాకర్ రెడ్డి, అబ్దుల్ ఖాదర్, అనంతయ్య, నాగిరెడ్డి, దత్తాత్రేయ రావు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/20604/