schedule Saturday, September 19, 2026

ప్రగతి సభలో రెచ్చిపోయిన దొంగలు

calendar_today September 28, 2023
person dharshininews
ప్రగతి సభలో రెచ్చిపోయిన దొంగలు
ప్రగతి సభలో రెచ్చిపోయిన దొంగలు - బంగారు గొలుసుల చోరీ - పండగ చేసుకున్న హస్తవాసిలు - పోలీసులను ఆశ్రయించిన బాధితులు తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతి ప్రస్థాన సభలో గుర్తుతెలియని దొంగలు హస్తవాటం ప్రదర్శించారు. అవకాశం దొరికిందని అందిన కాడికి దోపిడి పర్వం కొనసాగించారు. సభకు వచ్చిన వారి మెడలో బంగారు ఆభరణాలను చాకచక్యంగా లేపుకెళ్లారు. పట్టణంలోని విలియమూన్ గ్రౌండ్‌లో బీఆర్ఎస్ పార్టీ ప్రగతి ప్రస్థాన సభ జరిగింది. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. తాండూరుతో పాటు సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రాంతం నుంచి కూడా ప్రజలు భారీగా వచ్చారు. సమావేశంలో ముఖ్య నేతలు ప్రసంగిస్తుండగా పెద్ద ఎత్తున ఈలలు, కేకలు మార్మోగాయి. అదే సమయంలో ఆందోళన కారుల ఉద్రిక్తత్త కూడా జరిగింది. ఈక్రమంలో సభకు వచ్చిన కొందరు దోపిడికి గురయ్యారు. కొందరి మెడలో బంగారు ఆభరణాలను దోచుకున్నారు. మరికొందరి వద్ద డబ్బులను కూడా దోచుకున్నట్లు తెలిసింది. గురువారం ఉదయం పట్టణానికి చెందిన బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రగతి సభ నిర్వహిస్తే దొంగలు చేసిన పని వల్ల విమర్శులు వెలువెత్తాయి. అయితే పోలీసులు మాత్రం కర్ణాటక నుంచి వచ్చిన దొంగల పనే అని అనుమానిస్తున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20677/