schedule Monday, July 06, 2026

రేపు టీయూడబ్ల్యూజే ఆందోళన

calendar_today October 1, 2023
person dharshininews
రేపు టీయూడబ్ల్యూజే ఆందోళన
రేపు టీయూడబ్ల్యూజే ఆందోళన - విజయవంతం చేయాలని పిలుపు - జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వికారాబాద్, దర్శిని ప్రతినిధి: రేపు టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్‌ లు తెలిపారు. దేశంలో మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని, అక్రెడిటెడ్ జర్నలిస్టులకు రైల్వే పాస్ లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టాలని రాష్ట్ర కమిటి పిలుపునిచ్చినట్లు తెలిపారు. కావున గాంధీ జయంతిలో వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో యూనియన్ జర్నలిస్టులు అందరు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు తాండూరులో రేపు ఉదయం 10-30 గంటలకు చైతన్య జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించి.. ఆ తరువాత పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం ఉంటుందని తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.రామకృష్ణలు తెలిపారు. ఈ దర్నాలో యూనియన్ జర్నలిస్టులు తప్పక పాల్గొనాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/20730/