schedule Saturday, September 19, 2026

స్వచ్ఛతలో భాగస్వాములు కావాలి

calendar_today October 1, 2023
person dharshininews
స్వచ్ఛతలో భాగస్వాములు కావాలి
స్వచ్ఛతలో భాగస్వాములు కావాలి - వీరశైవ సంఘాల ఆధ్వర్యంలో శ్రమదానం - స్వచ్ఛత హీ సేవాలో భాగంగా నిర్వహణ తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వచ్ఛతలో అందరు భాగస్వాములు కావాలని తాండూరు వీరశైవ, అనుబంధ సంఘాల నాయకులు అన్నారు. ఆదివారం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ పిలుపు మేరకు వీరశైవ సమాజం, వీరశైవ యువదళ్, అక్కన భళగ వీరశైవ మహిళ మండలి ఆధ్వర్యంలో పట్టణంలోని వీరశైవ కాంప్లెక్స్ వద్ద శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా సమాజం అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొని దుకాణాల సముదాయం వద్ద శ్రమదానం చేపట్టారు. చీపురులతో రోడ్లను శుభ్రం చేశారు. చెత్త చెదారాన్ని తొలగించి ట్రాక్టరుకు అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ స్వచ్ఛతకు అందరు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్వచ్ఛత పాటించడంలో అందరు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం గౌరవాధ్యక్షులు వాలి శాంతుకుమార్, అధ్యక్షులు ఆర్. బస్వరాజ్, ఉపాధ్యక్షులు సడ్డి సబ్రప్ప, కార్యదర్శి లింగదలి రవికుమార్, కోశాధికారి వాలి శ్రావణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు తంబాకు చంద్రశేఖర్, శెట్టి భాస్కర్, గౌరీ శంకర్, గూళీ పరమేశ్వర్ స్వామి, గంగా శ్రావణ్ కుమార్, సమాజం పెద్దలు గూళీ శివకుమార్ స్వామి, విశ్వనాధం, స్వామి, జొన్నల బస్వరాజ్, గంగిమళ్ల పద్మాకర్, నిర్ని వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20747/