schedule Monday, July 06, 2026

రేపు తాండూరులో పైలెట్ పర్యటన

calendar_today October 5, 2023
person dharshininews
రేపు తాండూరులో పైలెట్ పర్యటన
రేపు తాండూరులో పైలెట్ పర్యటన - అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు - ఉదయం నుంచి రాత్రి వరకు షెడ్యూల్ ఖరారు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేయనున్నారు. తాండూరు పట్టణం, తాండూరు మండలం, యాలాల, పెద్దేముల్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు షెడ్యూల్ ఖరారయ్యింది. తాండూరు పట్టణంలో బీసీ భవన్ కు శంకుస్థాపన, రోడ్డు విస్తరణకు శంకుస్థాపన, పాత తాండూరు ఆర్వోబీ బ్రిడ్జికి శంకుస్థాపన, ఆదర్శనగర్ థీమ్ పార్కుకు శంకుస్థాపన, ప్రభుత్వ జూనియర్ కాలేజీకి మిషన్ భగీరత నీటి సరఫరాకు శంకుస్థాపన, అంతరంలో ఆటోనగర్, బంజారభవన్, క్రిస్టియన్ భవన్ లకు శంకుస్థాపన, హిందూ, ముస్లింల స్మశాన వాటికలకు శంకుస్థాపన, మైఆనక అంగన్ వాడి, డ్వాక్రా భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా తాండూరు మండలంలోని ఖాంజాపూర్ చెక్ డ్యాంకు శంకస్థాపన, మండలంలో రోడ్డు పనులకు శంకుస్థాపన. జినుగుర్తి ఇండస్ట్రీయల్ పార్కుకు శంకుస్థాపన, చంద్రవంచలో చెక్ డ్యామ్ కు శంకుస్థాపన, బొంకూరు బ్రిడ్జికి శంకస్థాపన, బెల్కటూర్ బ్రిడ్జికి శంకస్థాపన, జినుగుర్తిలో గిరిజన సంక్షేమ పాఠశాల ప్రారంభోత్సవంతో పాటు అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన, ప్రహారి గోడ ప్రారంభోత్సవం చేయనున్నారు. మరోవైపు యాలాల మండలంలో బెన్నూర్ చెక్ డ్యాం, పెద్దేముల్ మండలంలో గాజీపూర్ బ్రిడ్జికి, బుద్దారం బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20820/